Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Devarakonda : గాజాపై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ భారీ ర్యాలీ..!

Devarakonda : గాజాపై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ భారీ ర్యాలీ..!

​దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జమీయత్ ఉలేమా ఏ హింద్ మరియు ఇస్లాహే ముఅష్రా కమిటీ దేవరకొండ ఆధ్వర్యంలో దీనికి సిపిఎం (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – మార్క్సిస్ట్) పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది.

ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగింది. ఈ సందర్భంగా ఫలస్తీన్ ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ, ఇజ్రాయెల్ దురాగతాలను ఖండించారు. ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేస్తూ ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

గాజాలో అమాయక పౌరులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరణిస్తున్నారని, దీనిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని ర్యాలీలో పాల్గొన్న వారు కోరారు. ఇజ్రాయెల్ దురాక్రమణ వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.

ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, గాజాలో శాంతి స్థాపనకు కృషి చేయాలని  కోరారు. ​స్థానిక పోలీసులు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో డిటి అయూబ్ ఖాన్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముఫ్తి జావీద్ హుస్సేన్ కాస్మి, ఖాజా మైనుద్దీన్, ఇలియాస్ పటేల్, మొహమ్మద్ సిరాజ్ ఖాన్, మహమ్మద్ యూనూస్, అంజత్, సిఐటియు నల్ల వెంకటయ్య, ఇలియాస్ బాబా తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Alumni : 22 ఏళ్ల స్నేహబంధం.. ఆత్మీయ సమ్మేళనం..!

  2. TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!

  3. Crime News : ఇద్దరు కొడుకులను చంపి.. తండ్రి ఆత్మహత్య..!

  4. SBI : ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. వారికి పూచికత్తు లేకుండా రూ.4 లక్షల రుణం..!

మరిన్ని వార్తలు