Doctorate : అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసికి డాక్టరేట్..!
Doctorate : అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసికి డాక్టరేట్..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామానికి చెందిన స్ప్రెడ్ ఇంటర్నేషనల్ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి మర్యాలాండ్ యూఎస్ఏ డాక్టరేట్ పురస్కారం అందుకోవడం అభినందనియమని లోక కవి అందెశ్రీ అన్నారు. శ్రీధర్ రెడ్డి అభినందన సభను ఆదివారం బాలాజీ ఫంక్షన్ హల్ లో నిర్వహించారు.
సభకు ముఖ్య అతిధులుగా అందె శ్రీ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కవి అందెశ్రీ మాట్లాడుతూ స్ప్రెడ్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవ సంస్థ స్తాపించి దాదాపుగా 25 సంవత్సరాలు గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించరన్నారు.
నిరక్షరాస్యత నిర్మూలనలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో వయోజన విద్య కేంద్రాలు నెలకొల్పి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యా బోధనకు విద్య వాలంటీర్ లను నియమించి వారికి తన సొంత నిధితో తో వారికి గౌరవ భృతి ఇస్తూ అనేక మంది విద్యారుల జీవితాల్లో వెలుగులు నింపి వారి ఉన్నతికి కృషి చేస్తున్న పటేల్ శ్రీధర్ రెడ్డి ని అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి చైర్మన్
పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో 44 పాఠశాలల్లో పదవ తరగతి లో ప్రధమ ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఏడు సంవత్సరాల పాటు 2000 నుండి 3000 రూపాయల స్కాలర్షిప్ లు అందిస్తూ వారి ఉన్నత అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా బాలెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దడం జరిగిందని పాఠశాలకు కంప్యూటర్లు ప్రొజెక్టర్లు, గ్రీన్ బోర్డులు, డెస్క్ బెంజీలు, సైన్స్ లేబరేటరీ, గ్రంథాలయం,
కళావేదిక వంటగదులు, మోడల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారని అంతేకాక రెండు ఎకరాల క్రీడాస్థలాన్ని ఉచితంగా పాఠశాలకు అందించి బాస్కెట్బాల్ కోర్టును నిర్మించారని, తను చదువుకున్న సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలవస్తలో ఉండడాన్ని గమనించి నూతన భవన నిర్మాణానికి తన నిధులతో పాటు ప్రభుత్వ సహకారంతో 45 లక్షల వ్యాయామంతో నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు.
ఇలాంటి సేవా దృక్పథం ఉన్న శ్రీధర్ రెడ్డి తమ్ముడిగా జన్మించడం నాకు గర్వంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమం లో సుధా బ్యాంకు ఎం ది పెద్దిరెడ్డి గణేష్, పట్టణ ప్రముఖులు, డాక్టర్ రామూర్తి, గండూరి శంకర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
MOST READ :
-
Elections : స్థానిక ఎన్నికలు.. పల్లెల్లో ఆశావహుల సందడి..!
-
Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!
-
Heavy Rain : ప్రమాద స్థాయిలో కప్పలవాగు ప్రవాహం.. భీంగల్ లో భారీ వరద ఉధృతి..!
-
Miryalaguda : యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతుల క్యూ.. ఒక్క బస్తా కూడా దొరక్క ఇక్కట్లు..!









