Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

BRS : బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత సస్పెన్షన్..!

BRS : బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత సస్పెన్షన్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవితను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్.. ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ తక్షణం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవిత ఇటీవల పార్టీకి, నేతలకు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ పార్టీ గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 1 (సోమవారం) ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ పై సిబిఐ విచారణ చేపడితే పార్టీ ఉంటే ఎంత..? పోతే ఎంత..? అనే వ్యాఖ్యలతో పాటు కాలేశ్వరంలో హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే అవినీతి జరిగిందని ఆమె పేర్కొన్నారు.

ఆమె వ్యాఖ్యలు పార్టీ నేతలను, పార్టీని కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ భావించింది. పార్టీ నాయకులతో సమావేశమైన కెసిఆర్ నాయకుల ఫీడ్ బ్యాక్ తీసుకొని ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

  2. High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!

  3. Nalgonda : రైతుల ఘోస.. యూరియా కోసం తెల్లవారుజామునుంచే భారీ క్యూ..!

  4. Elections : స్థానిక ఎన్నికలు.. పల్లెల్లో ఆశావహుల సందడి..!

  5. Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12కు ఎంపికైన టీచర్.. ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు