Aadhaar Centers : మనసాక్షి కథనానికి స్పందన.. దేవరకొండలో ఆధార్ కేంద్రాలలో అధిక రుసుము వసూళ్లపై అధికారుల విచారణ…!

Aadhaar Centers : మనసాక్షి కథనానికి స్పందన.. దేవరకొండలో ఆధార్ కేంద్రాలలో అధిక రుసుము వసూళ్లపై అధికారుల విచారణ…!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని కొన్ని ఆధార్ నమోదు కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్నాయనే ఆరోపణలపై అధికారులు స్పందించారు. ‘మనసాక్షి’ పత్రికలో ఈ విషయమై కథనం ప్రచురితమైన నేపథ్యంలో దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
’మనసాక్షి’ కథనం ప్రకారం ఆధార్ కార్డులో మార్పులు, చేర్పుల కోసం ప్రజల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కన్నా ఐదు నుండి పది రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పేద, నిరక్షరాస్యుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నించారు. ఈ కథనంపై స్పందించిన అధికారులు తక్షణమే విచారణ చేపట్టారు.
విచారణ ప్రారంభం
జిల్లా అధికారి (ఈడియం) చల్ల దుర్గారావు ఆధార్ కేంద్రాలపై విచారణ ప్రారంభించారు. ప్రత్యేకంగా ఫిర్యాదులు అందిన యూనియన్ బ్యాంక్ ఆధార్ సెంటర్ వంటి కేంద్రాలను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆధార్ సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము వివరాలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రదర్శించాలని నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దోపిడీకి పాల్పడిన వారిపై జరిమానాలు విధించడం లేదా వారి లైసెన్సులను రద్దు చేయడం వంటి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అధికారులు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
MOST READ :
-
Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!
-
కల్వకుర్తిలో ఘరానా మోసం.. బైకులో ఉన్న డబ్బు స్వాహా..!
-
Water Well : బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి.. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
-
ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!
-
District collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!










