Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

కల్వకుర్తిలో ఘరానా మోసం.. బైకులో ఉన్న డబ్బు స్వాహా..!

కల్వకుర్తిలో ఘరానా మోసం.. బైకులో ఉన్న డబ్బు స్వాహా..!

కల్వకుర్తి, మనసాక్షి :

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బ్యాంకులో బంగారు తనఖా పెట్టి డబ్బులు తీసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు డబ్బులు ఎర చూపి బైక్ లో ఉన్న నగదును తీసుకొని పరారీ అయిన సంఘటన మంగళవారం కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. వంగూరు మండలం ఉల్పరకు చెందిన రెడ్డమోని రాము  ఎస్బిఐ బ్యాంక్ లో బంగారం కుదవపెట్టి రూ,2,79,000లు తీసుకొని ఇంటికి వెళ్తూ పెట్రోల్ పోసుకొనుటకు బంకుకు వెళ్లాడు.మార్గమధ్యలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ముందు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బైక్ పై వెనకాల వస్తూ డబ్బులు క్రింద పడినవి మీ డబ్బులేనా అని ఆయనతో అన్నారు.

దీంతో బైక్ ఆపి దిగి చూడగా ఒక వ్యక్తి  బైక్ కవర్ లో ఉన్న డబ్బును  తీసుకొని  పరారీ అయినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు.

MOST READ : 

  1. Nalgonda : 15న నల్లగొండకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక.. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  2. TG News : నడి రోడ్డుపై ఏంటివి ఇవి.. ఇలా ఎందుకు పెట్టారు.. అయినా వాళ్లు ఇటువైపు చూడరు..!

  3. District collector : ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..! 

  4. Additional Collector : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా అప్పుడే.. అదనపు కలెక్టర్ వెల్లడి..!

మరిన్ని వార్తలు