Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

TG News : నడి రోడ్డుపై ఏంటివి ఇవి.. ఇలా ఎందుకు పెట్టారు.. అయినా వాళ్లు ఇటువైపు చూడరు..!

TG News : నడి రోడ్డుపై ఏంటివి ఇవి.. ఇలా ఎందుకు పెట్టారు.. అయినా వాళ్లు ఇటువైపు చూడరు..!

చింతపల్లి, మన సాక్షి :

రెండు జిల్లాల కూడలి అయిన మాల్ వెంకటేశ్వర నగర్ గొడకొండ్ల గ్రామంలో నెలకొని ఉన్న హైదరాబాదు- నాగార్జునసాగర్ రాష్ట్రీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు నెలకొని ఉన్నాయి. అయితే ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉండి రెండు కిలోమీటర్ల పొడవు రహదారి పై ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.

100 ఫీట్ల రోడ్డు కలిగే డివైడర్ మధ్యలో ఉన్నప్పటికీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారస్తులు తమ అడ్వర్టైజ్ బోర్డులను రాళ్ల కుప్పలతో నడిరోడ్డుపై ఏదేచ్ఛగా పెట్టుకొని ప్రమాదాలకు చోటు కల్పిస్తున్న పోలీసులకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతినిత్యం ఇరువైపులా రహదారి వెంట ఉదయం సాయంత్రం ఉద్యోగస్తులు వాహనదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి ప్రయాణం చేస్తుండడంతో మాల్ వ్యాపార కూడల్లో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి వాహనదారులకు ఎదురవుతుంది.

ప్రతిరోజు ఓ పక్క యాచారం మండలం పిఎస్ పరిధిలోని పోలీసులు, చింతపల్లి పీస్ పరిధిలోని పోలీసులు ప్రతినిత్యం పెట్రోలింగ్ చేస్తున్నా గానీ వారి కంటికి ఈ ప్రమాద హెచ్చరిక వ్యాపారం బోర్డులు, నిర్వహించే వ్యాపారాలు కనిపించడం లేదా అని వాహనదారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

ముఖ్యంగా మర్రిగూడ సెంటర్ వద్ద, ఉడిపి హోటల్ వద్ద, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటోలు, కార్లు ద్విచక్ర వాహనాలు ఎంతో రద్దీగా వెళ్తుంటాయి. ఇటీవల డివైడర్ సెంటర్లో ఏ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్ బోర్డుల ను మోటార్ బైక్ ఢీకొని ఇరువురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

అయినప్పటికీ పోలీసులు చోద్యం చూస్తూ రోడ్డుకు ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వ్యాపారస్తుల తమ వ్యాపారాలను కొనసాగిస్తున్న తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు ప్రయాణికులు వాహనదారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సాయంకాలం అయ్యిందంటే ఏ వాహనం ఎటు నుండి వచ్చి నీ కొడుతుందో న ని ప్రయాణికులు జంకుతున్నారు.

ఉన్న 100 ఫీట్ల సిసి రోడ్డును రోడ్డు కిరువైపులా అటు 10 ఫీట్లు ఇటు పది ఫీట్లు వ్యాపారస్తులు ఆక్రమించుకొని వాహనదారులకు ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తున్నారని వివిధ గ్రామాల ప్రయాణికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

ఇకనైనా సంబంధిత రెండు మండలాలు పోలీస్ అధికారులు చొరవ తీసుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా నడిరోడ్డుపై నిర్వహించే వ్యాపారస్తులపై చర్యలు చేపట్టి ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా నడిరోడ్డుపై ఏదేచ్ఛగా పెట్టిన బోర్డులను అడ్వర్టైజ్ బోర్డులు తొలగించాలని గ్రామస్తులు ప్రయాణికులు, కోరుకుంటున్నారు.

MOST READ :

  1. ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!

  2. District collector : ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..! 

  3. Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!

  4. Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!

  5. District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!

మరిన్ని వార్తలు