Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

District collector : ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..! 

District collector : ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..! 

టేక్మాల్, మనసాక్షి:

టేక్మాల్ మండలంలో దన్నురా గ్రామంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతినీ పరిశీలించారు. మండలంలో 474 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా వివిధ దశలలో పురోగతిలో ఉన్నవని తెలిపారు. త్వరితగతిన ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఒడి ఒడిగా బిల్లులు మంజూరు అవుతున్నాయి. అని తొందరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ వారంలో జిల్లా వ్యాప్తంగా ఈ వారం 378 లబ్ధిదారులకు గాను 3 కోట్ల 88 లక్షలు బిల్లులు జమ చేయడం జరిగింది అన్నారు.

ఇల్లు బేస్పేట్ లెవెల్ కు వస్తే లక్ష రూపాయలు, రూప్ లెవెల్ మరొక లక్ష, స్లాబ్ పూర్తి చేసుకుంటే రెండు లక్షలు, పరిపూర్ణంగా ఇల్లు పూర్తయిన పక్షంలో లక్ష రూపాయలు మొత్తం 05 లక్షలువిడతల వారీగా ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు ముందుగా అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి నాణ్యతలో రాజీ పడకుండా మెనూ అందించాలని అన్నారు. అనంతరం తరగతి గదిలో
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. హాజరు శాతం పెరగాలని ప్రతి ఒక్కరూ పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు.

MOST READ : 

  1. Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!

  2. Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!

  3. Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!

  4. Yadadri : తాటి చెట్టుపై ప్రమాదం.. ప్రాణాలు తెగించి, గంటన్నర కష్టపడి కాపాడిన తోటి గౌడన్నలు..!

మరిన్ని వార్తలు