Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!

Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!

గోదావరిఖని, మన సాక్షి:

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు పెద్దపెల్లి డిసిపి కరుణాకర్ తెలిపారు. మంగళవారం నిందితుని వివరాలు వెల్లడించారు. స్థానికంగా డిగ్రీ చదువుతున్న కవ్వంపల్లి అరుణ్ కుమార్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నాడు. చెడు అలవాట్లకు బానిసగా మారి జల్సాల కోసం సులభంగా డబ్బులు సంపాదించవచ్చని దొంగతనాలు చేస్తున్నాడు. వన్టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐలు, క్రైమ్ పార్టీ సిబ్బందితో తీముల్గా ఏర్పడి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఫైవ్ ఇంక్లైన్ ప్రాంతంలో అనుమానా స్పదంగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు సీఐ సిబ్బందితో కలిసి నిందితుడి ని అదుపులో కి తీసుకున్నారు. నిందితుడి నుండి 23.6 గ్రాముల బంగారం, 45 తులాల వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

MOST READ : 

  1. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. రాష్ట్రమంతా ఎల్ఈడి వీధి దీపాలు..!

  2. Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ ఘనకార్యం.. ఆలస్యంగా వెలుగులోకి..!

  3. Nalgonda : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి..!

  4. Dost : దోస్త్ ద్వారా రేపు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..!

మరిన్ని వార్తలు