Additional Collector : అదనపు కలెక్టర్ర్ ఆదేశాలు.. ఆ బార్ అండ్ రెస్టారెంట్లకు జరిమానా..!

Additional Collector : అదనపు కలెక్టర్ర్ ఆదేశాలు.. ఆ బార్ అండ్ రెస్టారెంట్లకు జరిమానా..!
గోదావరిఖని, మన సాక్షి :
నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించడం , చెత్త బహిరంగ ప్రదేశాలలో వేయడం తదితర అపరాదాలకు స్థానిక బార్ అండ్ రెస్టారెంట్ లకు రామగుండం నగర పాలక సంస్థ జరిమానా విధించింది. అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశాల మేరకు మున్సిపల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మంగళ వారం సాయంత్రం పలు బార్ అండ్ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సంధర్భంగా నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులను ఉపయోగిస్తున్న తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ , రామాంజనేయ బార్ అండ్ రెస్టారెంట్ల కు రూ 5000/- చెత్త బహిరంగ ప్రదేశాలలో పడ వేసిన నాగులమ్మ బార్ అండ్ రెస్టారెంట్ కు రూ . 2000/- జరిమానా విధించారు. ఈ తనిఖీలలో సానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్ , నాగ భూషణం ఆద్వర్యంలో ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , జవాన్లు అశోక్ సంపత్ , సోమేశ్ , దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









