Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsతెలంగాణరంగారెడ్డి

Task Force : టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు.. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!

Task Force : టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు.. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!

మన సాక్షి,  వెబ్ డెస్క్ :

జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా మరియు టీమ్ అధికారులు తాండూరు పట్టణంలో నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తున్న దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగా నకిలీ సరుకును స్వాధీనం చేసుకో కోవడం జరిగింది. ఈ దాడుల్లో నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులను అధికారులు గుర్తించారు.

తాండూర్ పట్టణం లో మణికంఠ కిరాణా షాప్ యజమాని పి. వీరన్న షాప్ లో మొదట టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా కల్తీ అల్లం వెల్లుల్లి లభించగా అతనిని అదుపులోకి తీసుకోని విచారించగ హైదరాబాద్ అసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ సలీమ్ దెగ్గర తీసుకుంటున్నట్లు చెప్పగా అతనిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది.

A1)ఇమ్రాన్ సలీం: హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ సలీం అనే వ్యక్తి వద్ద సుమారు 166 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 కిలోల బాటిళ్లు 32, 1 కిలో బాటిళ్లు 6 ఉన్నాయి. అదనంగా 30 కిలోల కల్తీ అల్లం రెండు బస్తాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

A2) పి. వీరన్న: ఎస్‌బిఐ సమీపంలో మణికంఠ కిరాణం యజమాని పి. వీరన్న వద్ద 30 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ లభించింది. ఇందులో 500 గ్రాముల బాటిళ్లు 38, 200 గ్రాముల బాటిళ్లు 48, మరియు 100 గ్రాముల బాటిళ్లు 25 ఉన్నాయి.

మొత్తం 196 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తో పాటు, 60 కిలోల పాడైన అల్లం ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పేస్ట్ లో హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు వాడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నకిలీ పేస్ట్ ను ఆహార పదార్థాల్లో వాడడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు.

పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం తాండూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ నకిలీ సరుకు ఎక్కడ తయారు అవుతుంది, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటువంటి నకిలీ ఉత్పత్తులను నివారించడానికి భవిష్యత్తులో కూడా దాడులు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి తెలియజేయడం జరిగింది.

MOST READ : 

  1. Additional Collector : సాదాబ్ బై నామాలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారికి నోటీసులు ఇవ్వాలి..!

  2. Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశాలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..!

  3. Godavari khani: భార్యను హత్య చేసిన భర్త.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

  4. Karimnagar : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు