Nalgonda : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు..!

Nalgonda : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు..!
నల్లగొండ, మన సాక్షి.
విజయదశమి పండుగ పురస్కరించుకుని జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి అందరికీ అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో జిల్లా యస్.పి ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎం.టి. విభాగం వద్ద వాహనాల పూజ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,యస్బి సిఐ రాము, 2 టౌన్ సీఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహ. లక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్, సూరపు నాయుడు, శ్రీను, హరిబాబు, ఆర్ఎస్ఐలు కల్యాణ్ రాజ్, రాజీవ్, అఖిల్, సాయి రామ్, సంతోష్, శ్రావణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Ex Municipal Chairperson : ఛండీహోమం నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్..!
-
Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!
-
Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!
-
Miryalaguda : వాడపల్లి యాస్సైపై ఎస్సీ ఎస్టీ శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు..!









