Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లారాజకీయం

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై పూల వర్షం కురిపించిన కొండారెడ్డిపల్లి గ్రామస్తులు..!

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై పూల వర్షం కురిపించిన కొండారెడ్డిపల్లి గ్రామస్తులు..!

వంగూరు, మన సాక్షి :

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా వేడుకలను పురస్కరించుకొని తన సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి కి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుండి బయలుదేరి 3:20 గంటలకి కొండారెడ్డిపల్లి కి చేరుకున్న ముఖ్యమంత్రికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కేవీయన్ రెడ్డి, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు.ఈ పూజల అనంతరం నేరుగా ఆయన తన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపారు.

సాయంత్రం ప్రజానీకం గ్రామ శివారులో నిర్వహించనున్న జమ్మి చెట్టు పూజలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటల తర్వాత రోడ్డు మార్గం ద్వారా కొడంగల్ కు చేరుకుంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

వెల్దండ మండలానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ మరియు వెల్దండ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంను మర్యాదపూర్వకంగా కలసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

MOST READ : 

  1. Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!

  2. Sand : ఇసుక ర్యాంపులపై అధికారుల దాడులు.. తెప్పలు ధ్వంసం, మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్..!

  3. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

  4. Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!

మరిన్ని వార్తలు