District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాలి..!
నల్లగొండ, మన సాక్షి.
ఈ నెల 4 నుండి 12 వరకు “మానసిక ఆరోగ్యం- శ్రేయస్సు” పై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఎదో రకంగా మానసికంగా బాధపడుతున్నారని, మరికొందరు మానసిక వత్తిడికి లోనవుతున్నారన్నారు.
అయినప్పటికీ మనం ఈ సమస్యను పక్కన పెడుతున్నామని, మానసిక వత్తిడి తగ్గాలంటే జీవన విధానంమార్చుకోవాలని , స్మార్ట్ ఫోన్ ను సాధ్యమైనంతగా తగ్గించాలని, ప్రత్యేకించి పాఠశాల, కళాశాల విద్యార్థులు స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టాలన్నారు. పెద్దలు సైతం రాత్రి సమయాలలో వత్తిడి లేకుండా ఉన్నప్పుడే మంచి నిద్రతో పాటు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మానసిక ఆరోగ్యం పై లయన్స్ క్లబ్ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలునిర్వహించాలన్నారు.
మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన సరిపోదని ,మానసిక ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యమని, దీనికై ఉదయపు నడక, ప్రశాంతత, ఒత్తిడికి లోను కాకుండా ఉండడమే ముఖ్యమని అన్నారు. ఇటీవల కాలంలో చిన్న వయసు వారు సైతం గుండెజబ్బులతో చనిపోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నామని, మనిషి అనేక రకాల ఒత్తిళ్లకు గురి కావడం జరుగుతున్నదని, ఈ వత్తిడికి అన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలని , మెదడుకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని,ఇందుకు గాను తప్పనిసరిగా ఒత్తిడి కల్పించని అంశాలను చదవాలని చెప్పారు. పోటీ పరీక్షలు,ఇతర అంశాలలో పేద పిల్లలకు సహాయం చేసేందుకు నల్గొండలో ఒక టౌన్ హాల్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఈ విషయంలో లయన్స్ క్లబ్ సహకరించాలని కోరారు.
లయన్స్ క్లబ్ లాగా అందరూ ముందుకు వచ్చి సామాజిక సేవా పద్ధతిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మదన్ మోహన్ రేపాల. తీగల మెుహన్ రావు మల్టీ పుల్ జీఎస్టీ ఆర్డినేటర్, కె.విప్రసాద్ వి డి జి వన్,సతీష్ కుమార్ కోడె వీడి జీవితం నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి , రామకృష్ణ చిలుకూరి. గట్టుపల్లి అశోక్ రెడ్డి. రవిందర్ రావు బాచుపల్లి, డాక్టర్ వై. సుదాకర్ .బండారు ప్రసాద్దు, అంజి రెడ్డి, రీజియన్ చైర్ పర్సన్ లు, జోన్ చైర్ పర్సన్ లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
MOST READ :
-
Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!
-
Tea Snacks : టీతో ఈ స్నాక్స్ కలిపి తినకూడదు.. కారణం ఏంటంటే..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వద్దు..!
-
Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!









