Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వద్దు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వద్దు..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ లోకల్ బాడీ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్థానిక సంస్థ ల ఎన్నికల నిర్వహణ పై అదనపు రెవిన్యూ కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ తో కలిసి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగివుండాలని అన్నారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వస్తువుల సీజ్ చేసిన సందర్భాలలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా జరిగేలా చూడాలని అన్నారు.

ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదలైన తరువాత నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై అవగాహన తెచ్చుకోవాలన్నారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని అన్నారు. అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, వెబ్‌కాస్టింగ్ తదితర విభాగాల వారీగా సంబంధిత నోడల్ అధికారులు, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించామని, ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు.

ఈ సమావేశంలో ఎస్ డి సి రాజేందర్ గౌడ్, డి.ఎస్.పి నల్లపు లింగయ్య, జెడ్పీ సీఈఓ మొగులప్ప, సీపీ వో యోగానంద్, నోడల్ అధికారులు ఎం. ఏ. రషీద్, రెహమాన్, వెంకటేష్, సైదులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Sand : ఇసుక ర్యాంపులపై అధికారుల దాడులు.. తెప్పలు ధ్వంసం, మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్..!

  2. Nalgonda : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు..!

  3. Croma : పండగ సీజన్ భారీ ఆఫర్స్.. ఏఏ వస్తువులకు.. ఎప్పటి వరకు అంటే..!

  4. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

మరిన్ని వార్తలు