Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావ్యవసాయం

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఉపయోగకరంగా కపాస్ కిసాన్ మొబైల్ యాప్..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఉపయోగకరంగా కపాస్ కిసాన్ మొబైల్ యాప్..!

నారాయణపేటటౌన్, మనసాక్షి :

పత్తి కొనుగోళ్ల కు సంబంధించి సీ సీ ఐ కొత్తగా తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్ గురించి జిల్లా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కు సంబంధించి వరి ధాన్యం, పత్తి కొనుగోళ్ల మద్దతు ధరలను తెలిపే గోడ ప్రతులను మంగళ వారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ల లో కొత్త యాప్ విధానాన్ని అమలు చేయడం ద్వారా మిల్లుల వద్ద పత్తి రైతులు నిరీక్షించే పరిస్థితి ఉండదని తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు వారం రోజులలోపు ఎప్పుడైనా పత్తిని మిల్లులకు తీసుకెళ్ళి విక్రయించుకోవచ్చని ఆమె చెప్పారు.

జిల్లాలో ఈ సారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి బాలామణి, సివిల్ సప్లై డీ.ఎం. సైదులు, డీ.ఎస్.వో బాల్ రాజ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి భారతి, సూపర్ వైజర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

MOST READ : 

  1. Apollo : ఖచ్చితమైన ఆయుర్వేద చికిత్స కోసం తెలంగాణలోకి అపోలో ఆయుర్వేద్..!

  2. SBI : ఎస్బిఐ కీలక ప్రకటన.. ఇక నిమిషాల్లోనే లోన్..!

  3. Alumni : 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

  4. Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!

  5. Bonus : బోనస్ డబ్బులు వెంటనే ఇవ్వాలని రోడ్ ఎక్కిన రైతన్నలు..!

మరిన్ని వార్తలు