Breaking Newsఆంధ్రప్రదేశ్క్రీడలు

Hand Ball : రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు..!

Hand Ball : రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా మదనపల్లి బి టి కళా శాల మైదానంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హ్యాండ్ బాల్ జట్ల ఎంపికలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెంబకూరు విద్యార్థులు అద్భుతమైన ఆటతీరుతో కనబబరిచి హ్యాండ్ బాల్ అండర్ 17 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

అండర్ 17 బాలుర విభాగంలో ఎస్. కార్తిక్ రాజు, అండర్ 17 బాలిక విభాగంలో జి. గుణశ్రీ, అండర్ 14 బాలుర విభాగంలో కే. లోచన్ సాయి అండర్ 14 బాలికల విభాగంలో కే. జాహ్నవి, ఎన్. మహిత, పి. రాధ లు ఎంపికైనట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు తెలియజేసారు.

వీరు ఈ నెల 30 తేదీ నుండి గుంటూరు పట్టణంలో జరుగు అండర్ 17,14 రాష్ట్ర స్థాయి పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా మహిళా కార్యదర్శి ఝాన్సీ తెలియజేశారు.రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ అండర్ 17,14 పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. రమేష్ బాబు, పి డి దిలీప్ కుమార్, ఎం. మంజుల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

హెచ్ ఎం రమేష్ బాబు మాట్లాడుతూ చెంబకూరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు తల్లి దండ్రులకు మండలానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.

MOST READ : 

  1. District collector : అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం.. బాల్య వివాహాలు లేని గ్రామాలుగా మార్చాలి..!

  2. District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!

  3. Nalgonda : పిన్ని కూతురిని గర్భవతిని చేసిన అన్న.. 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష..!

  4. Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు..!

మరిన్ని వార్తలు