Hyderabad : మియాపూర్ లో ఐదంతస్తుల అక్రమ భవనం కూల్చివేసిన హైడ్రా అధికారులు..!

Hyderabad : మియాపూర్ లో ఐదంతస్తుల అక్రమ భవనం కూల్చివేసిన హైడ్రా అధికారులు..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు తాజాగా శనివారం మియాపూర్‌లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, నకిలీ రికార్డులతో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం నాడు పోచారంలో రూ.30 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కూడా హైడ్రా కాపాడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.. శనివారం నాడు నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలకు దిగింది. దీనిలో భాగంగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పీజేఆర్ కాలనీ, మియాపూర్ సరిహద్దు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలకు దిగింది.
చందానగర్-అమీన్‌పూర్ బార్డర్ పరిధి ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి.ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ మొదలుపెట్టిన హైడ్రా.. మియాపూర్‌లోని సర్వే నంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగాయని గుర్తించింది.
ఆక్రమణదారులు సర్వే నంబర్ మార్చి హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన కంచెను తొలగించి మరీ ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనెంబర్ 100లో 307, 308 పేరిట దొంగ రికార్డులు సృష్టించి నిర్మాణాలు జరిపారు. ఐదంతస్తుల అపార్ట్ మెంట్ నిర్మించారు. దీని గురించి స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఇవి అక్రమ నిర్మాణాలుగా తేలడంతో అధికారులు కూల్చివేశారు.
MOST READ :









