Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TG News : ఎమ్మెల్యే టికెట్ అనుకుంటే.. ఏకంగా మంత్రి పదవి దక్కింది..!

TG News : ఎమ్మెల్యే టికెట్ అనుకుంటే.. ఏకంగా మంత్రి పదవి దక్కింది..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

జూబ్లీహిల్స్ లో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా అజారుద్దిన్ పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుత ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఆయన టికెట్ తనకి ఇవ్వాలని అడిగుతున్నట్లు చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఉప ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ను అధిష్టానం ఇవ్వలేదు. కానీ ఏకంగా ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజారుద్దీన్ శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ను దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట్లో 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా ఆ తర్వాత మరో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ మంత్రి వర్గం 16 కు చేరింది.

MOST READ : 

  1. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!

  2. Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!

  3. New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!

  4. Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

మరిన్ని వార్తలు