Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

TG News : చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేషియా..!

TG News : చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేషియా..!

మన సాక్షి :

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాపూర్ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి చెందారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

మృతులకు రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో, క్షతగాత్రులకు 50 వేల పరిహారం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు, క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా :

మీర్జాపూర్ ప్రమాదం తనను కలిచివేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిహారంతో పాటు సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ ఇన్సూరెన్స్ ని కూడా అందిస్తామని, బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం చాలా బాధాకరం అని తెలిపారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్, కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

MOST READ : 

  1. Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!

  2. Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!

  3. Traffic : రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీరు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు..!

  4. Champion : నేషనల్ గేమ్ ఛాంపియన్‌కు ఎంపికైన యువతి.. దాతల కోసం ఎదురుచూపు..!

మరిన్ని వార్తలు