Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ..!

Nalgonda : నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ..!
కనగల్, మన సాక్షి:
ఎన్నికల నియమావళి పాటించి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం మండలంలోని చర్లగౌరారంలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలన్నారు.
అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ఎస్పి వెంట నల్లగొండ డిఎస్పి శివరామరెడ్డి, చండూరు సీఐ ఆదిరెడ్డి, ఎంపీడీవో వేద రక్షిత కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డిలు ఉన్నారు.
MOST READ :
-
Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!
-
Election Code : ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలి..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!
-
High court : సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల జీవో 46 పై హైకోర్టులో విచారణ..!









