Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

Elections : సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా.. అయితే ఇవి చూసుకోండి..!

Elections : సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా.. అయితే ఇవి చూసుకోండి..!

కంగ్టి, నవంబర్ 30, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో 3వ విడత నామినేషన్లు డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు అర్హతలు, నామినేషన్ వేసే విధానం, తదితర వివరాలు ఇలా ఉన్నాయి.

అభ్యర్థి కనీసం 21 ఏండ్ల వయసు నిండి ఉండాలి.

ఏ గ్రామంలో పోటీ చేస్తే ఆ గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి.

క్రిమినల్ కేసుల్లో శిక్ష పడడం దివాలా తీయడం ప్రభుత్వానికి లేదా స్థానిక సంస్థలకు బకాయిలు ఉంటే సదరు అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించవచ్చు.

పోటీ చేసే స్థానం ఏదైనా రిజర్వేషన్ ( ఎస్సీ, ఎస్టీ, బీసీ,మహిళ ) కు కేటాయించబడిన ఉంటే ఆ రిజర్వేషన్ వర్గానికి చెందిన వారై ఉండాలి.

రిజర్వుడ్ కేటగిరి సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ రుసుం రూ.1000, జనరల్ రూ.2000, రిజర్వేషన్ వార్డుసభ్యుడికి రూ.250, జనరల్ కు రూ.500.

అభ్యర్థన గుర్తింపు కార్డు కోసం ఫోటోను సమర్పించాలి.

స్కూటీని రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా హాజరు కావాలి.

సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ సెట్లు ఎన్ని వేసిన ఒకే డిపాజిట్ చెల్లించబడుతుంది.

వార్డు సభ్యులు ఒకటికంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్లు వేసిన ఒకే వార్డుకు మించి పోటీ చేయరాదు.

By : Jaleel Rusthum

MOST READ : 

  1. Kondagattu Fire : కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 33 షాపులు..!

  2. Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!

  3. Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

  4. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్.. డ్రైవర్ బ్యాగులో రూ.4.30 లక్షలు..!

మరిన్ని వార్తలు