Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Devarakonda : కాంగ్రెస్ కార్యకర్తల సమీక్ష సమావేశం.. ఎమ్మెల్యే బాలు నాయక్ కీలక వ్యాఖ్యలు..!

Devarakonda : కాంగ్రెస్ కార్యకర్తల సమీక్ష సమావేశం.. ఎమ్మెల్యే బాలు నాయక్ కీలక వ్యాఖ్యలు..!

చింతపల్లి, మన సాక్షి :

గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల పనిచేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం చింతపల్లి మండలంలోని గడియ గౌరారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పలు సూచనలు అందజేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని అలాగే ప్రతిపక్షాలు అవలంబించే తీరును ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుపుతూ చైతన్యంగా ఉండాలని అన్నారు.

చింతపల్లి మండలంలోని గోళ్లపల్లి గ్రామానికి మాజీ సర్పంచ్ బి. రంగాచారి గారు గత కొన్ని రోజుల క్రితం బుర్రకథలో అవార్డు వచ్చిన సందర్భంగా వారికి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యాదగిరి రావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం గుండ్లపల్లి నర్సిరెడ్డి, దొంతం వెంకట నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి గ్రామ శాఖ అధ్యక్షులు శివ కృష్ణ, గుండెమోని కృష్ణయ్య,నాయకులు గుణ మోని ని శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. District collector : ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటి.. జిల్లా కలెక్టర్ ఆగ్రహం..!

  2. TG NEWS : సర్పంచ్ ఎన్నికల వేళ.. మద్యం రవాణా.. తనిఖీలలో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు..!

  3. Nizamabad : మార్కెట్ తరలింపు కోసం ఉద్రిక్తత.. అఖిల పక్షం రోడ్డుపై భైఠయింపు..!

  4. IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!

మరిన్ని వార్తలు