Nalgonda : కమ్మేసిన పొగమంచు.. దారి తెలియక వాహనదారుల అవస్థలు..!
నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్మేసింది. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మంచు ముసుగులో చిక్కుకున్నాయి.

Nalgonda : కమ్మేసిన పొగమంచు.. దారి తెలియక వాహనదారుల అవస్థలు..!
గుర్రంపోడు, మన సాక్షి:
నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్మేసింది. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మంచు ముసుగులో చిక్కుకున్నాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం నెమ్మదించింది.పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రహదారిపై కొన్ని మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు గుర్తుపట్టలేని పరిస్థితి ఉండటంతో, వాహనదారులు తమ వాహనాల హెడ్‌లైట్లు వేసుకుని అతి తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నారు.
పొగమంచుతో పాటు చలి తీవ్రత కూడా తోడవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
ఉదయాన్నే పనులకు వెళ్లే రైతులు, కూలీలు చలి తీవ్రతకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు కారణంగా రహదారులపై దృశ్యమానత తక్కువగా ఉన్నందున, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.









