Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : సొంత జిల్లాకే కలెక్టర్ గా వచ్చిన బడుగు చంద్రశేఖర్.. ఏ ఊరంటే..!

నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా బుధవారం బాధ్యతలు చేపట్టిన బడుగు చంద్రశేఖర్ సొంత ఊరు ఎక్కడో తెలుసా..

Nalgonda : సొంత జిల్లాకే కలెక్టర్ గా వచ్చిన బడుగు చంద్రశేఖర్.. ఏ ఊరంటే..!

మన సాక్షి, నల్గొండ :

నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా బుధవారం బాధ్యతలు చేపట్టిన బడుగు చంద్రశేఖర్ సొంత ఊరు ఎక్కడో తెలుసా.. ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుతం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి ఆయన సొంత ఊరు.

బడుగు చంద్రశేఖర్ పద్మశాలి ముద్దుబిడ్డ. 2018వ బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. 2023 జూలై 19వ తేదీన సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా నియమించబడి పాలనపై పట్టు సాధించారు. ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ గా ఆయన నల్లగొండకు బదిలీపై వచ్చారు.

ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బడుగు చంద్రశేఖర్ నల్గొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడంతో జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాడని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా కృషి చేస్తాడని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ 

  1. Nalgonda : జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ..!

  2. District collector : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి..!

  3. Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!

  4. TG News : గురుకులంలో దారుణం.. విద్యార్థినిని ప్రత్యక్షణారహితంగా కొట్టిన వార్డెన్..!

మరిన్ని వార్తలు