తెలంగాణజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

 Narayanpet-Kodangal lift Irrigation : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం పై ముగిసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ..!

తెలంగాణ కాలుష్య నియంత్ర ణ మండలి ఆధ్వర్యంలో మక్తల్ - నారాయణపేట - కొడం గల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దామరగిద్ద తండా లో గురువారం ఏర్పా టు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

 Narayanpet-Kodangal lift Irrigation : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం పై ముగిసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

తెలంగాణ కాలుష్య నియంత్ర ణ మండలి ఆధ్వర్యంలో మక్తల్ – నారాయణపేట – కొడం గల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దామరగిద్ద తండా లో గురువారం ఏర్పా టు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

మూడు నియోజకవర్గాల నుంచి మూడు నియోజక వర్గాలలోని 7 మండలాల నుంచి ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అందరూ ముక్త కంఠంతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి పర్యావరణ ముప్పు, విఘాతం లేదని, వీలైనంత తొందరగా ఆ పథ కానికి పర్యావరణ అనుమ తులు ఇచ్చి ప్రారంభించాలని ఏకాభిప్రాయాన్ని తెలియ జేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ కాలుష్య నియం త్రణ మండలి(పి సి బి) హైద రాబాద్ ప్రాంతీయ కార్యాల యం నుంచి ఈ ఈ సురేష్ హాజరు కాగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీవో రామచందర్ నాయక్, నీటి పారుదల శాఖ ఎస్. ఈ శ్రీధర్ పాల్గొన్నారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ లో భాగంగా ఏడు మండలాల నుంచి వచ్చిన వందలాది మంది సమక్షంలో 28 మంది వక్తలు తమ తమ అభిప్రా యాలను వెల్లడించారు.

అందరూ మక్తల్- నారాయ ణపేట – కోడంగల్ ఎత్తిపోతల పథకం పనులను తొందరగా ప్రారంభించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, ఆ పథకం పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని కోరారు. ఆ పథకం చేపడితే పర్యావరణానికి వచ్చే నష్టం ఏమీ లేదని, గాలి, నీరు, వాతావరణ కాలుష్యం ఏమీ జరగదని తేల్చి చెప్పారు. ఆ పథకం పూర్తి అయితే పర్యా వరణం ఇంకా మెరుగు అవుతుందని తెలిపారు.

వెంటనే పథకం ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని అధికారి సురేష్ ను వారు కోరారు. చివర్లో అధికా రి సురేష్ మాట్లాడుతూ పర్యా వరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వచ్చిన అభి ప్రాయాలన్నింటిని నమోదు చేసుకున్నామని, మొత్తం కార్యక్రమాన్ని వీడియో చిత్రీక రణ చేయడం జరిగిందని, మీటింగ్ మినిట్స్ తో పాటు వీడియో ను కాలుష్య నియం త్రణ మండలి కి సమర్పిస్తా మని తెలిపారు.

ఆ పథకంలో ఊట్కూర్ గ్రామం ముంపున కు గురయ్యే ఆస్కారమే లేదని, ఊట్కూరు మండల పరిసరాలలో సంచరించే జింకలను సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు బడ్జెట్ కేటా యించడం జరిగిందని నీటి పారుదల శాఖ ఎస్. ఈ. శ్రీధర్ ఓ ప్రశ్నకు సమాధా నంగా బదులిచ్చారు.

ఈ కార్యక్రమంలో నారాయణ పేట మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ కుంభం శివకుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఈ ఈ బ్రహ్మానందరెడ్డి, పర్యావ రణ కన్సల్టెన్సీ కరీముల్లా,

దామరగిద్ద తహసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో జయలక్ష్మి, దామరగిద్ద తండా సర్పంచ్ శరణ్ నాయక్, దామరగిద్ద సర్పంచ్ అద్దన్ కనికి రెడ్డి, బాపన్ పల్లి సర్పంచ్ దవినోళ్ల శ్రీను, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు రైతు సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో కార్యాలయ రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్..!

  2. Miryalaguda : NH 167 విస్తరణకు గడువు ముగిసినా ఖాళీ చేయని ఇళ్ల యజమానులు.. సబ్ కలెక్టర్ నోటీసులు..!

  3. TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!

  5. Miryalaguda : కారెక్కుతున్న నేతలు.. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు..!

మరిన్ని వార్తలు