District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. వారు విస్తృత తనిఖీలు నిర్వహించాలి..!
ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా ఆహార భద్రత అధికారులు హోటల్లు, దాబాలు, తినుబండారాలు, ఆహార ఉత్పత్తుల కేంద్రాలపై విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు .

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. వారు విస్తృత తనిఖీలు నిర్వహించాలి..!
నల్లగొండ, మన సాక్షి :
ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా ఆహార భద్రత అధికారులు హోటల్లు, దాబాలు, తినుబండారాలు, ఆహార ఉత్పత్తుల కేంద్రాలపై విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు .శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత అధికారులు జిల్లాలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడి కేంద్రాలు ,ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల నుండి ఆహార శాంపిల్లు సేకరించాలని ఆదేశించారు.
కాంట్రాక్టు కాటరింగ్ ఉన్న ప్రతి సంస్థ నుండి ప్రతినెల ఒకసారైనా శాంపిల్లు సేకరించాలని ,ఆహార నాణ్యత ,పౌష్టికాహార విలువలను తనిఖీ చేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా కల్తీ ఆహారం అమ్ముతున్నట్లయితే కేసులు నమోదు చేయాలని చెప్పారు. ప్రజలు కల్తీ ఆహారం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు.
అలాగే అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడి కేంద్రాలకు ఎఫ్ఎస్ ఎస్ ఏ ఐ లైసెన్సులు జారీ చేయాలని, మే చివరి నాటికి జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు ఎఫ్ఎస్ ఎస్ ఏ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలకు ఎఫ్ఎస్ ఎస్ ఏ ఐ ధ్రువపత్రం జారీ విషయమై ఎంఈఓ లు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ల తో సమావేశం నిర్వహించి దరఖాస్తు, శిక్షణ ఇవ్వాలని, కాంప్లెక్స్ హెచ్ఎంలు హెడ్మాస్టర్లకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అలాగే రహదారి 65 జాతీయ రహదారిపై ఉన్న హోటల్లు ,దాబాలను ఆకస్మిక తనికీలు, దాడులు నిర్వహించి ఆహారాన్ని తనిఖీ చేయాలని చెప్పారు. ఇదివరకు కేసులు నమోదు చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని, పాఠశాలల్లో ఆహార వస్తువుల భద్రత, నిలువ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, కల్తీ ఆహారంపై ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి తో పాటు, ఏరియా ఆసుపత్రుల లో, సంబంధిత సూపరింటిండెంట్లు, అందరితో కలిపి నెలకు ఒకసారి విధిగా సమావేశాలు నిర్వహించాలని, అలాగే జిల్లా జైలులో సైతం ఎఫ్ ఎస్ ఐ లైసెన్స్ ఇవ్వాలని అన్నారు. సంక్రాంతి ని దృష్టిలో ఉంచుకొని 65వ జాతీయ రహదారిపై హోటల్లు, దాబాలలో నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసే విధంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.స్తినివాస్, అదనపు ఎస్పీ రమేష్,అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి ,సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
MOST READ
-
TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!
-
Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!
-
District SP : జిల్లా ఎస్పీ కఠిన హెచ్చరిక.. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో కౌన్సిలింగ్..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!









