TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఇకపై వారిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులను మానవీయ కోణంలో ఆదరిస్తోంది.

TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఇకపై వారిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులను మానవీయ కోణంలో ఆదరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులకు ఎంతో సహకారం అందిస్తున్నారు. వారికి సమాజంలో ఆత్మగౌరవం మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
దివ్యాంగులకు 50 కోట్ల రూపాయలతో సహాయ ఉపకారణాలను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజాభవన్ లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ, వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు, బాల భరోసా పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచితస్థానం ఇస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ, విద్య, క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు ప్రోత్సహించేలా ప్రభుత్వం పని చేస్తుందని, దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని పేర్కొన్నారు.
క్రీడలలో దివ్యాంగులను ప్రోత్సహించడానికి పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
MOST READ
-
Sub Collector : పిహెచ్సి సబ్ సెంటర్లను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..!
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!
-
Miryalaguda : మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల వేడి.. అధికార కాంగ్రెస్ లో వారంతా పోటీకి నై..!
-
PDS : రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు.. రేషన్ బియ్యం పట్టివేత..!









