Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

TG News : బస్తీలో సవాల్.. హోరా హోరీగా కుస్తీ పోటీలు..!

మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామం తుంబురీశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా అదివారం గ్రామ సర్పంచ్, నిరుడి దాస్, ఉప సర్పంచ్, ఎంపీ సుధాకర్, ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు.

TG News : బస్తీలో సవాల్.. హోరా హోరీగా కుస్తీ పోటీలు..!

టేక్మాల్, మన సాక్షి:

మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామం తుంబురీశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా అదివారం గ్రామ సర్పంచ్, నిరుడి దాస్, ఉప సర్పంచ్, ఎంపీ సుధాకర్, ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. కోబ్బరికాయ కుస్తీతో మొదలుకొని 5 తులాల వెండి కడేం కుస్తి వరకూ అంగరంగా వైనవంగ కుస్తీ పోటీలు జరిపారు.

ALSO READGold Price : ఊహించని రీతిలో మళ్లీ వేలల్లో పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మల్లయోదులు కుస్తీ పట్టడం జరిగింది. ఈ కుస్తీ పోటీలకు మహారాష్ట్ర కర్ణాటక నాందేడ్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి మల్లాయోధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సినిమా లను తలపిస్తున్న విదంగా కుస్తీ పోటీలు చూపారులను ఆకర్షించాయి.

చివరి కుస్తీ మహారాష్ట్ర డేగ్లూర్ కు చెందిన ఓంకార్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అంతపుర్ గ్రామానికి కు చెందిన గంగాధర్ మల్లయోధుల కుస్తీ హోరా హోరీగా కొనసాగింది. చివరకు అంతపుర్ కు చెందిన గంగాధర్ పైల్వాన్ కుస్తీ గెలుపొందాడు. గెలుపొందిన కుస్తీ పైల్వాన్ కు సర్పంచ్ నిరుడి దాస్, ఉప సర్పంచ్, ఎంపీ సుధాకర్ ల చేతుల మీదుగా పూలమాల వేసి 5 తులాల వెండి కడెం బహూకరించాడు.

ALSO READTragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

ఆనంతరం తుంబురీశ్వర స్వామి దర్శించుకుని దివెనలు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో వార్డు మెంబర్లు శ్రీహరి, దేవసాయం, చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, ప్రవీణ్ పటేల్, వెంకట్,గ్రామ పెద్దలు, రాఘవేంద్రర్, రాములు,నర్సింలు, కృష్ణ మూర్తి, రమేష్, రాజు, ముత్యం, మల్లేశం,శ్రీరాములు, రామకృష్ణ, వివిధ గ్రామాల ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ALSO READ District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ప్రజావాణి రద్దు..!

మరిన్ని వార్తలు