Nalgonda : ఎన్.జి కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్..!
నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆంగ్ల విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలు స్రవంతి మద్దెలకు రాజస్థాన్ కు చెందిన జగదీష్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

Nalgonda : ఎన్.జి కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్..!
నల్లగొండ, మన సాక్షి :
నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆంగ్ల విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలు స్రవంతి మద్దెలకు రాజస్థాన్ కు చెందిన జగదీష్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.
డా. అన్షు శర్మ పర్యవేక్షణలో “ఎ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ఐడియాలాజీ అండ్ ఫెమినిజం ఇన్ ది వర్క్స్ ఆఫ్ సరోజినీ నాయుడు, అరుంధతి రాయ్, ప్రేమ్ చంద్ అండ్ యాష్పాల్” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు.
డా. స్రవంతిని వైస్ ప్రిన్సిపాళ్లు డా. రవి కుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారి డా. ముని స్వామి, విద్యాత్మిక సమన్వయ కర్త బత్తిని నాగరాజు, ఆంగ్ల విభాగం అధ్యక్షులు డా. వై.వి.ఆర్. ప్రసన్న కుమార్, తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, జంతుశాస్త్ర విభాగం అధ్యక్షులు డా. జ్యోత్స్న, అధ్యాపకులు డా. జి. భాగ్యలక్ష్మి, డా. ఎ. మల్లేశం, సరిత, వెంకట్, హరికృష్ణ, వేణు తదితరులు అభినందించారు.