Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణ

Breaking News : టాప్ 5, మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!

మన సాక్షి వెబ్ పోర్టల్ ద్వారా ఫ్లాష్ న్యూస్ మీకోసం..

Breaking News : టాప్ 5, మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి వెబ్ పోర్టల్ ద్వారా ఫ్లాష్ న్యూస్ మీకోసం..
1. హైదరాబాదులోని సనత్ నగర్ లో కల్తీ టీ పొడి కలకలం రేపింది. ఫతేనగర్ లో నివసించే అతను టీ పొడి కి సింథటిక్ రసాయనాలు, రంగులు కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు. ఆహార కల్తీ అధికారులు, పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యాపారి నిందితుడు పై కేసు నమోదు చేశారు.

2. హైదరాబాదులోని మాదాపూర్ కాకతీయ హిల్స్ లో ఉన్న 100 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. కగా కొద్దిరోజులుగా ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగి 4090 గజాల పార్కు స్థలాన్ని కాపాడి ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు

3. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ లో భారీగా విదేశీ మద్యం పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 50 కాటన్ల విదేశీ మద్యం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు.

4. హైదరాబాదులోని అరంగర్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. భారీ కంటైనర్ లో ఆవులు తరలిస్తుండగా గోరక్ష కార్యకర్తలు అడ్డుకున్నారు. కంటైనర్ డ్రైవర్ పై స్థానికులు, గోరక్ష కార్యకర్తలు దాడి చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మొహిదీ పట్నం నుండి వరంగల్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

5. ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. మీసేవ, మొబైల్ యాప్ లో తెలంగాణ ఆర్టీసీ టికెట్ల బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. మీ టికెట్ మొబైల్ యాప్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. డిజిటల్ గా సుదూర, ఇంటర్సిటీ బస్ టికెట్ల బుకింగ్ సౌకర్యం మొబైల్ యాప్ ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తం 1710 బస్సు సేవలు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు