రాజకీయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Shankarpally : శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్‌గా సాత ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకారం..!

శంకర్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాత ప్రవీణ్ కుమార్ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Shankarpally : శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్‌గా సాత ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకారం..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

శంకర్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాత ప్రవీణ్ కుమార్ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ యోగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్‌తో పాటు 13 మంది కౌన్సిలర్లు కూడా తమ పదవుల బాధ్యతలను అధికారికంగా చేపట్టారు.

కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతన చైర్మన్‌కు పూలదండలు, శాలువాలతో సత్కారం చేశారు. డప్పుల శబ్దాలు, శుభాకాంక్షల నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది చైర్మన్‌కు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలు కూడా కొత్త నాయకత్వంపై ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాత ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, కాల్వల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రతి వార్డులో సమాన అభివృద్ధి జరిగేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పని చేస్తానని, సమస్యలు తెలుసుకోవడానికి వార్డుల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు.

పారదర్శక పరిపాలన, సమిష్టి కృషితో శంకర్‌పల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని వెల్లడించారు.  నాయకులు, ప్రజలు నూతన బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని ఆకాంక్షించారు.

MOST READ 

మరిన్ని వార్తలు