Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల్లో రికవరీ ఎలా అయిందంటే..!

Nalgonda: A woman lost Rs. 15 lakh in gold in Nalgonda district.. How did it get recovered in hours..!

Nalgonda : నల్గొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల్లో రికవరీ ఎలా అయిందంటే..!

మన సాక్షి, నాగర్జున సాగర్ :

నల్గొండ జిల్లాలో 15 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఓ మహిళ పోగొట్టుకుంది. గంటల వ్యవధిలోనే పోలీసులు రికవరీ చేశారు. వివరాల ప్రకారం.. బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో వాటిని ఇంట్లో ఉంటే జాగ్రత్తగా ఉంచుకోలేమని బ్యాంకులో భద్రపరిచేందుకు నాగార్జునసాగర్ లోని పైలాన్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కొమ్ము రాహేల్ కుమారి ఈనెల 23వ తేదీ విజయపురి ఎస్బిఐ బ్రాంచ్ లో తన వద్ద ఉన్న తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను భద్రపరచుకునేందుకు వెళ్ళింది.

బ్యాగును పక్కనపెట్టి మంచినీళ్లు తాగేందుకు వెళ్ళి తిరిగి వచ్చేవరకు కవర్ కనిపించలేదు. దాంతో బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకు సిసి పుటేజ్ ఆధారంగా బంగారం తీసుకెళ్లిన మహిళను గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు 24 గంటల్లో నగలను పోలీసులు రికవరీ చేసి మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ గారి చేతుల మీదుగా బాధితురాలికి అందజేశారు. నగలు పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ శ్రీను నాయక్, ఎస్ఐ ముత్తయ్య, మహిళా పోలీస్ సిబ్బంది రాజేశ్వరిని డిఎస్పి అభినందించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు