Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Breaking : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు మృతి..!
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

Breaking : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు మృతి..!
మన సాక్షి, నల్గొండ :
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేక్యతండ గ్రామపంచాయతీలో వస్త్రం తండ వద్ద ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కూడా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









