Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు..!

హాలియా పట్టణంలో మైనర్ డ్రైవింగ్‌పై మంగళవారం పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్‌లో మైనర్లు నడిపిన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ సాయి ప్రశాంత్ తెలిపారు

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు..!

హాలియా, మనసాక్షి :

హాలియా పట్టణంలో మైనర్ డ్రైవింగ్‌పై మంగళవారం పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మైనర్లు నడిపిన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ సాయి ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ చర్యపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మైనర్లు వాహనాలు ఇచ్చే తల్లితండ్రులకు 25,000 రూ వరకు భారీ జరిమానా, వాహనం రిజిస్ట్రేషన్ రద్దు, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

అవసరమైతే జైలు శిక్ష కూడా ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి, పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా ఎదుటి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు.మైనర్లు అవగాహనా లేకుండా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ లొ పలువురు మైనర్లకు ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చారు.

MOST READ 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు