Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రేపటి నుంచి మిర్యాలగూడలో శ్రీ మహాలక్ష్మి యాగం.. ఏర్పాట్లు పూర్తి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి సంకల్పంతో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ మహాలక్ష్మి యాగం ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది.

Miryalaguda : రేపటి నుంచి మిర్యాలగూడలో శ్రీ మహాలక్ష్మి యాగం.. ఏర్పాట్లు పూర్తి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి సంకల్పంతో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ మహాలక్ష్మి యాగం ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ భూ, గోదా దేవి సమేత గోవింద పెరుమాళ్ళ అనుగ్రహంతో ఈ యాగం నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు యాగంలో పాల్గొనేందుకు గాను ఏర్పాట్లను పూర్తి చేశారు. లోక కళ్యాణార్ధం శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నారు.

27వ తేదీన శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ వరకు శోభాయమానంగా వేలాదిమంది మంగళ శ్రీమూర్తులు, మంగళ ద్రవ్యాలు అయినటువంటి పసుపు, కుంకుమలతో అత్యంత వైభవంగా మంగళ వాయిద్య కారులతో శ్రీ లక్ష్మీ నారాయణ లకు స్వాగత నీరాజనాలను ఏర్పాటు చేస్తారు. అనంతరం పూజ పుణ్యాచనం, తీర్థ ప్రసాదాల కార్యక్రమం ఉంటుంది.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గందె రాము

27వ తేదీ నుంచి మొదలయ్యే శ్రీ మహాలక్ష్మి యాగ కార్యక్రమాలు ఏప్రిల్ 1వ తేదీ వరకు బుధవారం వరకు కొనసాగుతాయి. యాగ ఏర్పాట్లను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గందె రాము బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. వారితో పాటు ఎస్సై రాంబాబు, రేపాల పురుషోత్తం రెడ్డి, పాల్వాయి సురేష్ తో పాటు యాగ కమిటీ సభ్యులు ఉన్నారు. వేలాదిమంది భక్తులు యాగం లో పాల్గొనేందుకు, వీక్షించేందుకు యాగశాల ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఇవీ చదవండి :

మరిన్ని వార్తలు