Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

Nagarjuna Sagar : విద్యాభివృద్ధికి వెంకటేశ్వర్ రెడ్డి విశేష కృషి..!

ఉన్నత విలువలతో 37 సంవత్సరాల పాటు విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ అనేక మంది విద్యార్థుల పురోభివృద్ధికి తోడ్పడిన వెంకటేశ్వర్ రెడ్డి అభినందనీయుడని పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్ పేర్కొన్నారు.

Nagarjuna Sagar : విద్యాభివృద్ధికి వెంకటేశ్వర్ రెడ్డి విశేష కృషి..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

ఉన్నత విలువలతో 37 సంవత్సరాల పాటు విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ అనేక మంది విద్యార్థుల పురోభివృద్ధికి తోడ్పడిన వెంకటేశ్వర్ రెడ్డి అభినందనీయుడని పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో నిర్వహించిన ఆయన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

మారుమూల గ్రామంలో ప్రైవేట్ పాఠశాల స్థాపించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చిన ఘనత వెంకటేశ్వర్ రెడ్డిదని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరి 24 సంవత్సరాల పాటు పలు పాఠశాలల్లో సేవలందిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.

పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు కాలం నారాయణరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకటేశ్వర్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేకల జాన్ రెడ్డి, పెద్దవూర మండల అధ్యక్షులు ఇరుమాది పాపిరెడ్డి, కార్యదర్శి దుర్గాప్రసాద్, పెద్దవూర మాజీ జెడ్పిటిసి అబ్బిడి కృష్ణారెడ్డి, నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గుడపర్తి రాజా ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీ గోవర్ధన్ రెడ్డి, అంజిరెడ్డి, వాసుదేవుల సత్యనారాయణ రెడ్డి, నర్సిరెడ్డి, తిరుమలగిరి సాగర్ మండలం మాజీ ఎంపీపీ భగవాన్ నాయక్, మరియు పత్రిక మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు