Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఘోర ప్రమాదం.. బైకును ఢీకొట్టిన ఆర్టిసి బస్సు, యువకుడు మృతి..!

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో సోమవారం ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని తానేదార్‌పల్లి ఎక్స్ రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.

Nalgonda : ఘోర ప్రమాదం.. బైకును ఢీకొట్టిన ఆర్టిసి బస్సు, యువకుడు మృతి..!

గుర్రంపోడు, మన సాక్షి:

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో సోమవారం ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని తానేదార్‌పల్లి ఎక్స్ రోడ్డు వద్ద బైకును ఆర్టిసి బస్సు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం, గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్లపల్లి అంజిరెడ్డి (23) తన ద్విచక్ర వాహనంపై పనుల నిమిత్తం గుర్రంపోడుకు వచ్చాడు.

పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో, దేవరకొండ నుంచి నల్గొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తానేదార్‌పల్లి ఎక్స్ రోడ్డు వద్ద అతని బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు అంజిరెడ్డికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక ఎస్సై ఎన్. వెంకన్న సమాచారం అందుకున్న వెంటనే వివరాలు సేకరించారు. మృతుని తండ్రి వడ్లపల్లి మణిపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతితో సింగరాజుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ కళ్లముందే ఎదుగుతున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో బలికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని వార్తలు