Nalgonda : నల్గొండ జిల్లా భీమారంలో దారుణం.. గొర్రెల కాపరి దారుణ హత్య..!
కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన కలంచర్ల జానయ్య (65) అనే గొర్రెల కాపరి హత్యకు గురయ్యాడని శాలిగౌరారం సిఐ కె.కొండల్ రెడ్డి తెలిపారు.

Nalgonda : నల్గొండ జిల్లా భీమారంలో దారుణం.. గొర్రెల కాపరి దారుణ హత్య..!
కేతేపల్లి, మనసాక్షి
నల్గొండ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. జిల్లాలోని కేతపల్లి మండలం భీమారంలో గొర్రెల కాపరిని దుండగులు దారుణంగా హత్య చేశారు వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన కలంచర్ల జానయ్య (65) అనే గొర్రెల కాపరి హత్యకు గురయ్యాడని శాలిగౌరారం సిఐ కె.కొండల్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
భీమారం గ్రామానికి చెందిన కంచర్ల జానయ్య శుక్రవారం రాత్రి గ్రామంలోని కమ్మ బజారులో గల తన యొక్క గొర్రెల దొడ్డి వద్ద పడు కొన్నాడని, శనివారం ఉదయం జానయ్య భార్య చౌడమ్మ గొర్రెల దొడ్డి వద్దకు వెళ్లి నిద్రపోతున్న జానేను లేపటానికి దుప్పటి తీసి చూడగా అతని ముఖంపై బలమైన రక్త గాయాలు అయ్యి మంచం పైనే చనిపోయి ఉన్నాడని ఆయన తెలిపారు.
జానయ్యను గుర్తు తెలియని వ్యక్తులు ఏదో తెలియని కారణం వల్ల కానీ గొర్రెలను దొంగతనం చేయడానికి వచ్చి కానీ చంపి ఉండవచ్చునని ఆయన వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. క్రమంలో కేతేపల్లి ఎస్సై యు సతీష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.









