Breaking Newsక్రైంజిల్లా వార్తలు
Miryalaguda : చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు.. NDRF బృందం గాలింపు..!
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంకైన సంఘటన మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లిలో గురువారం చోటుచేసుకుంది.

Miryalaguda : చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు.. NDRF బృందం గాలింపు..!
మిర్యాలగూడ, మనసాక్షి :
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంకైన సంఘటన మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లిలో గురువారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యాదగిరిపల్లి గ్రామానికి చెందిన నూకల శంకర్ (38) మరో ముగ్గురు మత్స్యకారులతో కలిసి రాత్రి 11 గంటల సమయంలో యాద్గారి పల్లి చెరువులో చేపల వలలు వేయుటకు వెళ్లాడు.
కాగా బలమైన గాలుల ప్రభావంతో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి మునిగిపోయాడు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. మృతుడి తండ్రి నూకల లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.










