Viral Video : మహబూబాబాద్ లో వింత ఘటన.. గుండుతో ఉంటే గుర్తించని ఉపాధి హామీ సాఫ్ట్ వేర్.. (వీడియో )
మహబూబాబాద్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ కూలి గుండుతో ఉండడంతో సాఫ్ట్వేర్ యాప్ అతడిని గుర్తించలేదు. దాంతో అతడి గుండు పై మహిళ జుట్టు కప్పి అటెండెన్స్ వేయించుకున్నాడు.

Viral Video : మహబూబాబాద్ లో వింత ఘటన.. గుండుతో ఉంటే గుర్తించని ఉపాధి హామీ సాఫ్ట్ వేర్.. (వీడియో )
మహబూబాబాద్, మన సాక్షి :
మహబూబాబాద్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ కూలి గుండుతో ఉండడంతో సాఫ్ట్వేర్ యాప్ అతడిని గుర్తించలేదు. దాంతో అతడి గుండు పై మహిళ జుట్టు కప్పి అటెండెన్స్ వేయించుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉపాధి హామీ కార్మికుడు శ్రీనివాస్ ఇటీవల కొండగట్టు అంజన్నకు తలనీలాలు సమర్పించాడు.
అయితే ఉపాధి హామీ పనికి వెళ్లిన కార్మికుడు శ్రీనివాస్ ఫోటో కోసం దిగుతుండగా గుండుతో ఉండటం వల్ల అతన్ని సాఫ్ట్వేర్ యాప్ గుర్తించలేదు. పక్కనే ఉన్న మహిళ జుట్టును గుండు పై పరచడంతో అటెండెన్స్ నమోదుకు ఫోటో అంగీకరించింది.
ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో బయటపడ్డ లోపాలు
గుండుతో ఉన్న కార్మికుడిని గుర్తించని యాప్
గుండుపై మహిళ జుట్టు కప్పి అటెండెన్స్ వేసుకున్న కార్మికుడు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో ఇటీవల కొండగట్టు అంజన్నకు తలనీలాలు సమర్పించిన శ్రీనివాస్ అనే ఉపాధి హామీ కార్మికుడు… pic.twitter.com/PUKifkdN4R
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2026
VIRAL VIDEOS :
- Viral News : 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. భయంతో తల్లిదండ్రులు, 8వ తరగతి బాలుడు మాస్టర్ ప్లాన్..!
- Viral Video : పెళ్లి విందులో లెగ్ పీస్ వార్.. ఫంక్షన్ హాల్ రణరంగం.. (వీడియో)
- Viral Video : పాత సామాను తెచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!
- Viral : ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్య.. నవ్వుతూ వీడియో తీసిన సైకో భర్త.. (వీడియో వైరల్)









