Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsజాతీయం

Viral Video : పెళ్లి విందులో లెగ్ పీస్ వార్.. ఫంక్షన్ హాల్ రణరంగం.. (వీడియో)

పెళ్లి విందులో లెగ్ పీస్ లు రాలేదని వరుడి బంధువులు చేసిన గొడవ అంతింత కాదు. ఫంక్షన్ హాల్ మొత్తం రణరంగంగా మారింది. అక్కడ ఉన్న వాళ్ళు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

Viral Video : పెళ్లి విందులో లెగ్ పీస్ వార్.. ఫంక్షన్ హాల్ రణరంగం.. (వీడియో)

మనసాక్షి, వెబ్ డెస్క్:

పెళ్లి విందులో లెగ్ పీస్ లు రాలేదని వరుడి బంధువులు చేసిన గొడవ అంతింత కాదు. ఫంక్షన్ హాల్ మొత్తం రణరంగంగా మారింది. అక్కడ ఉన్న వాళ్ళు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం..

ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహ జిల్లా హసన్ పూర్ లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. పెళ్లిళ్ల విషయంలో చిన్న చిన్న వివాదాలు, మర్యాదల విషయంలో గొడవలు జరుగుతుండటం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం బిర్యానిలో లెగ్ పీస్ లు రాలేదని గొడవ పెద్దదిగా మారి రణరంగంగా మారింది.

వరుడు బంధువులు బిర్యానీలో లెగ్ పీసులు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. వడ్డించే వారితో మొదలైన చిన్నపాటి వాగ్వాదం ఇరువు వర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలు, ప్లేట్లతో దాడులు చేసుకున్నారు.

కొంతమందికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాదానికి కారణమైన వారిని గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోస్

మరిన్ని వార్తలు