Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : వరి కొయ్యలకు నిప్పు.. దేవల్లతండాకు వ్యాపించిన మంటలు, పూరి గుడిసెలు దగ్ధం..!

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మద్దిరాల మండలానికి చెందిన దేవల తండాకు సమీపంలో కొయ్య తగలబడుతూ భారీగా గాలి వీచడంతో కొన్ని ఎకరాల పొలము కొయ్య కాలుకుంటూ పచ్చని చెట్లు బుగి పాలు అవుతూ భారీ మంటలు గాలితో ఊరు బయట ఉన్న పూరి గుడిసెలలో నివాసముంటున్న గిరిజనులు ఆ మంటల నో ఆర్పడానికి ఎంతో ప్రయత్నం చేశారు.

Suryapet : వరి కొయ్యలకు నిప్పు.. దేవల్లతండాకు వ్యాపించిన మంటలు, పూరి గుడిసెలు దగ్ధం..!

తుంగతుర్తి,  మనసాక్షి :

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మద్దిరాల మండలానికి చెందిన దేవల తండాకు సమీపంలో కొయ్య తగలబడుతూ భారీగా గాలి వీచడంతో కొన్ని ఎకరాల పొలము కొయ్య కాలుకుంటూ పచ్చని చెట్లు బుగి పాలు అవుతూ భారీ మంటలు గాలితో ఊరు బయట ఉన్న పూరి గుడిసెలలో నివాసముంటున్న గిరిజనులు ఆ మంటల నో ఆర్పడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ గాలి బాగా వీచడంతో కంట్రోల్ కాక ఐదు గుడిసెలు బుగ్గి పాలయ్యాయి. అక్కడ నివాసం ఉంటున్న గిరిజనులు నగదు డబ్బుతో సహా వారి ఇంటి సామాగ్రి కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత రెండు రోజుల క్రితం మద్దిరాల మండలంలోని రెడ్డిగూడెం గ్రామంలో 200 ఎకరాలకు పైగా పొలము కొయ్య కాలుతూ బావుల వద్ద బోర్ల మోటార్లు పైపులైన్లు అన్ని కాలిపోవడంతో రైతులకు చాలా నష్టపరిహారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అది కోల్పోక ముందే పక్క గ్రామంలో అదే మండలంలో దేవలతండా సమీపంలోని అక్కమ్మ కుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వరికోయకు నిప్పు పెట్టారు.

తీవ్రమైన ఎండ గాలితో వడ గాలి బాగా వీచడంతో పొలాల నుండి కిలోమీటర్ విస్తరించి నేరుగా దేవల తండా పైకి దూసుకొచ్చాయి తండావాసులు ప్రాణాలకు తెగించి పంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది.

ఈ ప్రమాదంలో ఐదు పూరి గుడిసెలు నిప్పు అంటుకోగా మూడు గుడిసెలు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి మరో రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయి ప్రాణాప్రయం తప్పినప్పటికీ గుడిసెల్లో ఉన్న బియ్యం డబ్బులు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు నిత్యవసర వస్తువులు ఉండడంతో ఆ కుటుంబాలకు భారీ నష్టం ఏర్పడిందని గ్రామస్తులు తండావాసులు తెలిపారు.

ఇలా జరగడంతో ఆ గ్రామంలోని తండావాసులు రోడ్డున పడ్డారు సైదులు అనే రైతు 15000 పెట్టి ఇటీవలే పైపులు తీసుకోగా అవి కూడా మంటలకు పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం తమను ఆదుకోవడానికి జిల్లా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నారు

మరిన్ని వార్తలు