Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Devarakonda : తరుగు పేరుతో ధాన్యం దోపిడి..!

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు అవేదన చెందుతున్నారు అని దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

Devarakonda : తరుగు పేరుతో ధాన్యం దోపిడి..!

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

చింతపల్లి, మన సాక్షి :

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు అవేదన చెందుతున్నారు అని దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం డిండి మండలం తవక్లపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేక రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తపరిచారు.

రైతులకు సకాలంలో గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్తితిలో ప్రభుత్వం లేదు అని అన్నారు. కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 2 కేజిల వడ్లు కట్ చేస్తున్నారు అని వెంటనే ఆపాలని కోరారు. మిల్లర్లు 3కేజీలు కట్ చేస్తున్నారు అని ఆయన తెలిపారు. అధికారులు ఏం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో తిరగాలి అని సూచించారు ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు.

రైతన్నను ఆదుకోలేని ప్రభుత్వం చేతకాకపోతే గద్ద దిగాలన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన 6గ్యారంటీలు,420హామీలు అమలు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులనుకోరారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర్ రావు, పిఎసిఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు, సర్పంచ్ మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రవీందర్ రావు, గొడుగు వెంకటయ్య, గిరమోని శ్రీను,రమావత తులిసీరామ్, జంగయ్య,నాయకులు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు