PDS : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత..!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ సన్నబియ్యం అక్రమార్కులు పక్కదారి పట్టిస్తు పబ్బం గడుపుతున్నారు.

PDS : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత..!
తుర్కపల్లి, మన సాక్షి :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ సన్నబియ్యం అక్రమార్కులు పక్కదారి పట్టిస్తు పబ్బం గడుపుతున్నారు. అక్రమ రేషన్ బియ్యం రవాణాను కట్టడి చేయాలనే జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశాలతో తుర్కపల్లి ఎస్సై తక్యుద్దీన్ తమ సిబ్బంది ఆధ్వర్యంలో తుర్కపల్లి మీదుగా అక్రమంగా 100 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్న డిసిఎం వాహనాన్ని పట్టుకున్నామని తెలిపారు.
నిందితులైన ఆలేరు మండలం కందిగడ్డ తండా గ్రామానికి చెందిన కేడావత్ ప్రభాస్,బాణోత్ శివలను పట్టుకొని పోలీసులు విచారించగా ఆలేరు ప్రాంతనుండి, గజ్వేల్,సిద్ధిపేట వైపు బియ్యాన్ని తీసుకెళ్తున్నట్లు తెలిపారు. డిసిఎం వాహనాన్ని, నింధితులను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తక్యుద్దీన్ తెలిపారు.అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అమ్మిన, కొన్న నేరమని,అట్టి వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు…









