Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : ఎమ్మెల్యే బీఎల్ఆర్ పల్లెబాట, చిల్లాపురంలో పల్లెనిద్ర, పర్యటన..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి, గ్రామాల సమగ్ర పురోగతి లక్ష్యంగా చేపట్టిన ప్రగతి సింగిడి – జనంతో మాట.. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గురువారం రాత్రి మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామపంచాయతీ లో పర్యటించారు.

Miryalaguda : ఎమ్మెల్యే బీఎల్ఆర్ పల్లెబాట, చిల్లాపురంలో పల్లెనిద్ర, పర్యటన..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి, గ్రామాల సమగ్ర పురోగతి లక్ష్యంగా చేపట్టిన ప్రగతి సింగిడి – జనంతో మాట.. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గురువారం రాత్రి మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామపంచాయతీ లో పర్యటించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులపై వారి నుంచి నేరుగా వివరాలు తెలుసుకున్నారు. ప్రజల సూచనలు, వినతులను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్థులతో ఆప్యాయంగా మమేకమై, ప్రభుత్వ పాఠశాలలో రాత్రి బస చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు.

గ్రామ ప్రజలతో కలిసి వారి జీవన విధానాన్ని తెలుసుకుంటూ, గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలపై అధికారులతో చర్చించారు. శుక్రవారం గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహించి, గ్రామ ప్రజలతో మరోసారి సమావేశమై వారి సమస్యలు, అభివృద్ధి అవసరాలపై నిర్వహించనున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు