Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయంవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. తొలి విడుదల వారికి మాత్రమే..!

తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాదులోని శిల్పకళ వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి రైతు భరోసా నిధులు విడుదల చేశారు.

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. తొలి విడుదల వారికి మాత్రమే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాదులోని శిల్పకళ వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. తొలివిడతలో రెండు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు 41.37 లక్షల మందికి బ్యాంకు ఖాతాలో 2482 కోట్ల రూపాయలను జమ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 30 నెలల ప్రజా పాలనలో రైతులు తలెత్తుకునేలా పాలన అందించినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని భావించే పరిస్థితి కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్ర అప్పు కేవలం 69 వేల కోట్లు ఉండగా గత పది ఏళ్ల కాలంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని కెసిఆర్ పై విమర్శలు గుర్తించారు.

కల్వకుంట్ల కుటుంబం చేసిన అప్పులు.. తప్పుల భారం ఇప్పుడు తమ ప్రభుత్వం భరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బకాయిలు పెట్టింది బకాసురుడు.. కట్టే పాపం మాకా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా 36 వేల కోట్ల రూపాయలను రైతులకు అందించినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ నిలిపి వేస్తామని ప్రచారం చేశారని, కానీ 2004లో ఉచిత విద్యుత్తు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.

రైతుల కోసం ప్రతి నెల సుమారు 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కోసం 30 వేల కోట్ల రూపాయలు, రైతు బీమా కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు