Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదలలో బిగ్ ట్విస్ట్.. మొదటి విడత ఆ రైతులకు మాత్రమే..!

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సమావేశం నిర్వహించి రైతుల ఖాతాలలో నిధులు విడుదల చేయనున్నారు.

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదలలో బిగ్ ట్విస్ట్.. మొదటి విడత ఆ రైతులకు మాత్రమే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సమావేశం నిర్వహించి రైతుల ఖాతాలలో నిధులు విడుదల చేయనున్నారు. దాంతో వెంటనే రైతుల ఖాతాలోకి నిధులు జమ కానున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులకు కోటిన్నర ఎకరాల సాగు భూమి ఉండగా ఎకరానికి 6000 చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. అందుకుగాను దశలవారీగా 9 వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. అందులో భాగంగానే మంగళవారం (జూన్ 30న) తొలి విడత సన్న, చిన్న కారు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

తొలివిడతగా 41.37 లక్షల మంది సన్న చిన్న చిన్న కారు రైతులకు బ్యాంకు ఖాతాలలో 2,482 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనున్నది. రైతు భరోసా నిధుల బదిలీ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముంబై లోని ఆర్బిఐ కార్యాలయానికి హైదరాబాదులోని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ముందస్తు సమాచారం అందించింది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒకే విడతలో నిధులు విడుదల చేస్తారని భావించినప్పటికీ కేవలం మొదటి విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందనున్నది. మిగతా వారికి దశల వారీగా వారి వారి ఖాతాలలో నిధులు జమ కానున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు