గాసిరామ్ తండాలో విద్యుత్ సమస్య.. పట్టించుకునేవారేరీ..!
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం లోని దేన్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని గాసిరాం తండా గ్రామ ప్రజలు గత వారం రోజుల నుండి విద్యుత్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకునే వారు కరువయ్యారని ఆ గ్రామ ప్రజలు రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

గాసిరామ్ తండాలో విద్యుత్ సమస్య.. పట్టించుకునేవారేరీ..!
చింతపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం లోని దేన్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని గాసిరాం తండా గ్రామ ప్రజలు గత వారం రోజుల నుండి విద్యుత్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకునే వారు కరువయ్యారని ఆ గ్రామ ప్రజలు రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
దేన్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని గాసిరాం తండాకు తీదేడు విద్యుత్ సబ్‌స్టేషన్ నుండి గాసిరాం తండా ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇదే ఫీడర్ ద్వారా దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామానికి కూడా విద్యుత్ సరఫరా అందుతోంది.
అయితే విద్యుత్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రతి సారి వర్షం లేదా బలమైన ఈ దర్ గాలులు వీచినప్పుడు విద్యుత్ వైర్లు
ఒకదానికొకటి అల్లుకొని విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోతోంది. దీంతో గాసిరాం తండా, శేరిపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై గతంలో పలుమార్లు గ్రామ సభలో చర్చించి సంబంధిత విద్యుత్ లైన్మెన్ ,అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని గ్రామస్తులు వాపోతున్నారు. స్థానికంగా సిబ్బందిని అందుబాటులో ఉంచి, ఫీడర్ నిర్వహణను పటిష్ఠంగా చేపడితే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నివారించవచ్చుని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు.
అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులను దృష్టిలో పెట్టుకొని నెలకొన్న సమస్యను సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే చొరవ తీసుకొని గాసిరాం తండా ఫీడర్‌కు శాశ్వత పరిష్కారం చూపించి, ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను రైతులు గ్రామ ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో తేదేడు విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని రైతులు హెచ్చరించారు.