Miryalaguda : జిల్లాలో 20వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్.. పరిశీలించిన అధికారులు..!
జిల్లా వ్యవసాయ అధికారి వల్లోజు వినోద్ కుమార్, మిర్యాలగూడ వ్యవసాయ ఉప సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి , వ్యవసాయ అధికారి రుషేంద్రమణి తో కలిసి మిర్యాలగూడ లోని యూరియా రేక్ పాయింట్ మరియు మార్కుఫెడ్ బఫర్ స్టాక్ గోదాంను సందర్శించి యూరియా నిల్వలను పరిశీలించారు.

Miryalaguda : జిల్లాలో 20వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్.. పరిశీలించిన అధికారులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో 20వేల మెట్టు టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వల్లోజు వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం
జిల్లా వ్యవసాయ అధికారి వల్లోజు వినోద్ కుమార్, మిర్యాలగూడ వ్యవసాయ ఉప సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి , వ్యవసాయ అధికారి రుషేంద్రమణి తో కలిసి మిర్యాలగూడ లోని యూరియా రేక్ పాయింట్ మరియు మార్కుఫెడ్ బఫర్ స్టాక్ గోదాంను సందర్శించి యూరియా నిల్వలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కుఫెడ్ బఫర్ స్టాక్ గోదాంలో సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా ఎరువు తగినంత నిల్వ ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. యూరియా యాప్ గురించి రైతులతో చర్చించారు. అలాగే, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వల్లోజు వినోద్ కుమార్ సూచించారు.