Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
Narayanpet : ప్రజావాణి పై నారాయణపేట జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య..!
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు.

Narayanpet : ప్రజావాణి పై నారాయణపేట జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 14 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సత్వరం పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా ఆయా అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డి.ఆర్.ఓ.రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
MOST READ









